Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బెయిల్

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు బెయిల్
X

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్లారావు (అప్పటి డీఎస్పీ) తనకు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషల్ దాఖలు చేశారు. బెయిల్పైటిషన్పై పలు సార్లు విచారణ చేపట్టిన నాంపల్లి సెషన్స్ కోర్టు ఇవాళ షరతులతో కూడిన రెగ్యూటర్ బెయిల్మంజూరు చేస్తూ.. తీర్పు ఇచ్చింది. షరతుల్లో దేన్ని ఉల్లంఘించినా బెయిల్ రద్దుచే యడానికి వీలుంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భుజంగ రావు, రాధాకిషన్ రావు ఇప్పటికే బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.. తాజాగా ఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ బీఐ డీఎస్సీగా పని చేసిన దుగ్యాల ప్రణీత్ రావుకు కూడా బెయిల్ మంజూరు కావటం గమనర్హం. దీంతో ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రణీత్ రావు బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story