Prashant Kishor: పీకే వచ్చింది TRSతో ఒప్పందం రద్దుకా..? కొత్త వ్యూహం అమలుకా..?

Prashant Kishor: పీకే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి 2 రోజులు అయ్యింది. ప్రగతి భవన్‌లోనే మకాం వేసి.. చాలా కీలకమైన మేధోమథనం సాగిస్తున్నారు. అసలు ఎందుకు ఇదంతా..? ఓ పక్క జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలంటూ ఓ ఫార్ములా చెప్తూనే.. అవసరమైన చోట్ల ప్రాంతీయ పార్టీలతో పొత్తును PK ప్రతిపాదించారు. ఐతే.. తెలంగాణ లాంటిచోట్ల ఇది సాధ్యమయ్యే పనేనా.. ఉప్పు నిప్పులా ఉన్న కాంగ్రెస్-TRS కలిసి పోటీ చేస్తాయా..?
అలా కానప్పుడు PK ప్రగతిభవన్‌కి వెళ్లింది డీల్ క్యాన్సిల్ చేసుకోవడానికా..? ఇప్పుడిలా ఎన్నో ఊగాహానాలు తెరపైకి వచ్చాయి. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది..? ఇప్పటికే బెంగాల్, ఏపీ, తెలంగాణలో అధికారపార్టీలకు పీకే వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా పార్టీలో చేరాలనుకుంటే.. ఇతర పార్టీలకు వ్యూహకర్తగా పనిచేయడం సరికాదని ఏఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com