Khairatabad : ఖైరతాబాద్ గణేశ్ మండపం సమీపంలో గర్బిణీ ప్రసవం

హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని భారీ గణేష్ విగ్రహం వద్ద ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. గర్భం దాల్చిన ఒక మహిళకు పురిటి నొప్పులు రావడంతో అక్కడికక్కడే పురుడు పోశారు. దీం, ఆ మహిళ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాజస్థాన్‌కు చెందిన రేష్మ అనే గర్భిణి, ఆమె కుటుంబం ఖైరతాబాద్ గణేష్ మండపం పరిసరాల్లో బెలూన్లు, ఇతర ఆటవస్తువులను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రేష్మకు బుధవారం ఉదయం తీవ్రమైన పురిటి నొప్పులు వచ్చాయి. నొప్పులతో బాధపడుతున్న ఆమెను గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే స్పందించి గణేశ్ మండపం సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న తర్వాత స్ట్రెచర్ సిద్ధం చేస్తుండగా రేష్మకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆసుపత్రి భవనం సెల్లార్‌లోనే ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది వెంటనే స్పందించి తల్లీబిడ్డలకు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం, తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మండపం వద్ద ఉన్న భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తంచేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com