TG : పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు.. రద్దీ ఏరియాల్లో ఇంటలిజెన్స్ హెచ్చరిక

TG : పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు.. రద్దీ ఏరియాల్లో ఇంటలిజెన్స్ హెచ్చరిక
X

తెలంగాణ రాష్ట్రంలో ఉగ్ర కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా (ఐబీ) వర్గాలు ముందస్తు హెచ్చరికలు చేశాయి. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దేశవ్యాప్తంగా ఉగ్ర ప్రభావిత రాష్ట్రాలకు ముందస్తు హెచ్చరికలు చేశాయి. ఇందులో భాగంగా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్ర పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంటెలిజెన్స్ బ్యూరో పలు సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు అప్ర మత్తమైయ్యాయి.

ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఎ వర్గాలు ఉగ్రమూలాలపై ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. కేంద్ర హెచ్చరికలతో రాష్ట్రంలో పంద్రాగస్టు వేడుకలను భారీ భద్రత నడుమ నిర్వహించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవా దులు అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు కీలక నగరాలను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి.

కేంద్ర నిఘా వర్గాల ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. ఈక్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా అధికం చేశారు. రాష్ట్రంలో ఐఎస్ ఐఎస్, ఉగ్రభావజాలంపట్ల ఆకర్షితులైన వారి కదలి కలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు ఆధారాలు సేకరించిన అనంతరం సదరు యువకులను అదుపులోకి తీసుకోవాలని అటు ఎస్ఐఎ, ఇటు ప్రత్యేక పోలీసులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story