Vemulawada : సురేఖ సేవలో అర్చకులు.. వేములవాడ రాజన్నకు ఆలస్యంగా నైవేద్యం?

Vemulawada : సురేఖ సేవలో అర్చకులు.. వేములవాడ రాజన్నకు ఆలస్యంగా నైవేద్యం?
X

వేములవాడలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మరోవివాదం వెంటాడింది. మనవడి పుట్టువెంట్రుకలు తీయించేందుకు ఆలయానికి వచ్చారు మంత్రి కొండా సురేఖ దంపతులు. ఐతే.. మధ్యాహ్నం 3 గంటలకు రాజన్నకు అందించాల్సిన నైవేద్యాన్ని అర్చకులు ఆలస్యంగా అందించారని వివాదం చెలరేగింది.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి కొండ సురేఖ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ముందుగా పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్ మంత్రికి ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు మంత్రి. యాదాద్రి తారహాలో వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు.

Tags

Next Story