Prime Minister Modi : తెలంగాణ ఉపాధ్యాయుడికి ప్రధాని మోదీ ప్రశంసలు

తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీని వినియోగించుకొని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నామన్నారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం గా పూర్తిచేయడం దేశానికే గర్వకారణం అని కొనియాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్కీ బాత్' లో మోదీ మాట్లాడారు. ‘ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనేందుకు పారిస్ కు వెళ్లాను. ఏఐలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించింది. తాజాగా తెలంగాణ ఆదిలాబాద్లోని సర్కార్ స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారు. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తం' అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com