TG : విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్​ కొడుకు

TG : విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్​ కొడుకు
X

క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లే ఆరుగురు విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ కొడుకు చితకబాదిన ఘటన శామీర్​ పేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట్ లోనిసెయింట్ పాల్ పాఠశాల హాస్టళ్లో ఉంటున్న ఆరుగురు విద్యార్థులు క్రికెట్ అడడానికి వెళ్తుండగా చైర్మన్ కొడుకు అభిలాష్ మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు కొట్టి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించినట్లు తెలిపారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు వారి ఇళ్లకు వెళ్లి పోగా నాగర్ కర్నూలుకు చెందిన విద్యార్థి తల్లిదండ్రులు గమనించి మరో ముగ్గురు విద్యార్థులతో కలిసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల చైర్మన్ కొడుకు అభిలాష్ పై డీఈవో చర్యలు తీసుకుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు.

Tags

Next Story