Hydra : హైడ్రాపై నిరసనలు.. రోడ్లమీద ప్రతిపక్షాల మద్దతుతో వంటావార్పు

Hydra : హైడ్రాపై నిరసనలు.. రోడ్లమీద ప్రతిపక్షాల మద్దతుతో వంటావార్పు

హైదరాబాద్ లో హైడ్రా తీరుపై నిర్వాసితులు, బిల్డర్ల నిరసనకు ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎల్బీనగర్‌లో హైడ్రా బాధితులు వంటావార్పు నిర్వహించారు. హైడ్రా బాధితులతో కలిసి బీజేపీ నేత సామరంగారెడ్డి పాల్గొన్నారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవన్నారు. హైడ్రా పేదలను భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. పేదలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామన్నారు. హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story