TG : తెలుగు యూనివర్సిటీకి పేరు మార్పుపై నిరసనలు

X
By - Manikanta |18 March 2025 4:30 PM IST
తెలంగాణ ప్రభుత్వం తెలుగు యునివర్సీటికి పొట్టి శ్రీరాములు పేరుమార్చడంపై వ్యతిరేకత వస్తోంది. ఈ చర్యలను ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. తెలుగు ప్రజల కొసం ఆమరణ నిరహారదీక్ష చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని ఆయనకు ఓ ప్రాంతాన్ని అంటగట్టి యునివర్సీటి పేరుమార్చడం మూర్ఖత్వమని ఆర్య వైశ్య నాయకుడు దేవకి వాసుదేవరావు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కుతీసుకొకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com