Telangana : నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్ట్‌ రిలీజ్

Telangana : నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్ట్‌ రిలీజ్
X

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ప్రొవిజనల్ లిస్ట్‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది.ప్రతి అభ్యర్థి వివరాలను, ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను, వెయిటేజీ ద్వారా పొందిన మార్కులను లిస్ట్‌లో పొందుపర్చింది.ప్రతి అభ్యర్థి తాము పొందిన మార్కులు, ఇతర అంశాలను సరి చూసుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26 నుంచి సెప్టెంబర్2వ తేదీ లోపల తెలియజేయాలని సూచించింది. అభ్యంతరాల నమోదుకు ఈ నెల 26 నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో సదుపాయం కల్పిస్తామని పేర్కొంది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 23వ తేదీన పరీక్ష(computer based test) నిర్వహించగా... 40,243 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

Tags

Next Story