TG High Court : హైకోర్టులో HCU భూముల వేలంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం

కంచ గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం వేలానికి పెట్టిన 400 ఎకరాలు అటవీ భూమి అని, దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొ ంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. లాభాపేక్ష రహిత పర్యావరణ స్వచ్చంద సంస్థ 'వట ఫౌండేషన్' ఈ పిల్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామం సర్వేనెంబర్ 25 లో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ)కి బదలా యిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూన్ 26న జీవో 54 జారీచేసింది.
ఐటీ కంపెనీలు, మౌలిక సదుపాయాల కోసం ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ సిద్ధం చేయాలని సూచించింది. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.75 కోట్లకు ఎకరం చొప్పున విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ భూమిని దశలవా రీగా విక్రయిం చేందుకుగానూ ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ సిద్ధం చేయ డానికి టీజీఐఐసీ ఈ ఏడాది ఫిబ్రవరి 28న బిడ్లు ఆహ్వానించింది. ఈ ప్రక్రియను అడ్డుకోవడంతోపాటు అటవీ భూమిని విక్రయించ కుండా నిలువరించాలని వట సంస్థ కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com