TGPSC : గ్రూప్ 1 ఆరోపణలు ఖండించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్

TGPSC : గ్రూప్ 1 ఆరోపణలు ఖండించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్
X

గ్రూప్‌-1 నియామక ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖండించింది. పోటీ పరీక్షల్లో చాలా మందికి ఒకేలా మార్కులు రావడం సహజమేనని, గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనం ప్రొటోకాల్‌ ప్రకారమే జరిగిందని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘రీకౌంటింగ్‌ తర్వాత మార్కులు తగ్గాయని ఓ అభ్యర్థి తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆ అభ్యర్థికి నోటీసు ఇచ్చినట్లు తెలిపింది. ర్యాంకురాని కొందరు అభ్యర్థులు, కొన్ని కోచింగ్‌ సెంటర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నియామక పరీక్షపై వస్తున్న ఆరోపణలను అభ్యర్థులు నమ్మొద్దు’’ అని టీజీపీఎస్సీ ప్రకటనలో తెలిపింది.

Tags

Next Story