Bans Benefit Shows : పుష్ప ఎఫెక్ట్.. బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ నిషేధం

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోల ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షో లు వేసేందుకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సిటీ నడిబొడ్డున బెనిఫిట్ షో లు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. కుటుంబంతో సరదాగా మూవీ చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం తనను ఎంతగానో బాధించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ , రష్మికా మందన్న జంటగా నటించిన పుష్ప-2 ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య థియేటర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. అయితే, ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. థియేటర్ లోపలికి వెళ్లేందుకు జనం తోసుకోవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలో ఆరని చిచ్చు రగిలింది. తల్లి రేవతి తొక్కిసలాటలో చనిపోయింది. ఆమె కొడుకు హాస్పిటల్ లో అపస్మారక స్థితిలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com