TG : స్కూళ్లు, అంగన్ వాడీల్లో క్వాలిటీ టిఫిన్, లంచ్..కొడంగల్ నుంచే మొదలు

TG : స్కూళ్లు, అంగన్ వాడీల్లో క్వాలిటీ టిఫిన్, లంచ్..కొడంగల్ నుంచే మొదలు
X

పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల ద్వారా కార్యా చరణను అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తెలిపారు. అంచెలంచెలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మక పథకం అమలు క్రమంలో సీఎస్ఆర్ భాగస్వామ్యం కూడా కోరుతున్నామని అన్నారు సీఎం. ఇందుకు సంబంధించి ఆదివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంతో 'హరే రామ హరేకృష్ణ' ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు చదువులకు దూరమవుతున్న కుటుంబాల్లోని పిల్లలకు ప్రభుత్వం తరఫున పౌష్టికాహారం అందించేందుకు ముందడుగు వేశామన్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం అమలులో భాగస్వామ్యం పంచుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు.

హరేరామ హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్ఆర్ నిధులతో కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమా వేశమయ్యారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కొడంగల్ నియ వర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజూ ఉదయిం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేసున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతి నిధులకు సీఎం సూచించారు. హరేరామ హరేకృష్ణ

ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు.

Tags

Next Story