Allu Arjun Interrogation : అల్లు అర్జున్ ను చిక్కడిపల్లి పోలీసులు అడిగిన ప్రశ్నలివే

చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. గంటన్నర నుంచి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు.
1. బెనిఫిట్ షోకు.. మూవీ టీమ్ రావొ ద్దని యాజమాన్యం మీకు చెప్పిందా లేదా..?
2. పోలీసుల అనుమతి లేకుండా మూవీ టీమ్ థియేటర్కి రావొద్దనే విషయం మీకు తెలియదా? 3. పోలీసుల అనుమతి లేకుండా మీరు సంధ్య థియేటర్కి ఎందుకొచ్చారు?
4. గతంలో సినిమా చూసేందుకు ఎన్ని సార్లు సంధ్య థియేటర్కి వచ్చారు? 5. మీతో పాటు సినిమా చూసేందుకు
ఎంతమంది వచ్చారు? 6. సినిమాకు మీ ఫ్యామిలీతో పాటు భద్రతగా ఎంతమంది వచ్చారు? వివరాలేంటి?
7. మీరు థియేటర్ కి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది. దీనికి మీ సమాధానం?
8. చేతులు ఊపుతూ ర్యాలీగా థియేటర్లోకి ఎందుకు ప్రవేశించారు.
9. తొక్కిసలాట జరిగినా థియేటర్ నుంచి ఎందుకు బయటకు రాలేదు?
10. పోలీసుల విధులను మీరు అడ్డుకున్నారనే ఆరోపణలపై మీ సమాధానం?
11. రేవతి కుటుంబంతో మీరు మాట్లా డుతున్నారా? ఎలాంటి భరోసా ఇచ్చారు?
12. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి
చెందిన వారు..?
13. మీతో ఉన్న బౌన్సర్లను మీరు గుర్తు పడతారా..?
14. మీరు ఎంత మంది బౌన్సర్లను నియమించుకున్నారు..?
15.మీరు నియమించుకున్న బౌన్సర్లు మీతో ధియేటర్ దగ్గరకు ఎలా వచ్చా రు..?
వీటితోపాటు మరిన్ని అనుబంధ ప్రశ్నలు వేసినట్టు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com