Raghunandan Rao : రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట

మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు. ఉట్లపల్లి, పులి చెర్ల గ్రామాల్లో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీడీవో దుబ్బ సత్యం ఫిర్యాదు మేరకు రఘునందన్పై కేసు నమోదైంది. ఈ కేసును తాజాగా కోర్టు కొట్టేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం చెందడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉపఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. నోముల నర్సింహయ్య తనయుడు భగత్ పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత జానారెడ్డిపై 18,872 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com