Delhi: అధ్యక్ష పదవికి నేను అర్హుడినే : రఘునందన్‌రావు
By - Bhoopathi |3 July 2023 12:00 PM GMT
మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్‌రావు కోరారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాలని రఘునందన్‌రావు కోరారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇవ్వాలన్నారు. పదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నానని తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కానని పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో తన కులమే తన శాపం కావొచ్చన్న ఆయన రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని అన్నారు. రెండోసారి కూడా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు దుబ్బాకలో ఎవరూ సాయం చేయలేదని తాను పార్టీలో ఉండాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com