Bandi Sanjay : రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు: బండి సంజయ్

ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, దేశం లేదు అంటూ విరుచుకుపడ్డారు. ‘రాహుల్ తాత పేరు ఫిరోజ్ ఖాన్ గాంధీ. తల్లి సోనియా గాంధీ క్రైస్తవురాలు, ఇటలీ దేశస్థురాలు. రాహుల్ కులం మీద రేవంత్ ఏం సమాధానం చెప్తారు’ అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు.
ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఘునందన్ రావు కౌంటరిచ్చారు. ముందు రాహుల్ గాంధీ కులమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ కులం OC నుంచి BCకి వచ్చిందని ఇప్పుడే కనిపెట్టినట్లు ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోదీ గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు లేదన్నారు. మోదీ క్యాబినెట్‌లో 19 మంది బీసీలు ఉంటే రేవంత్ మంత్రివర్గంలో ఇద్దరే ఉన్నారని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com