Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా పరిస్థితి..

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా పరిస్థితి..
Rahul Gandhi: తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి.

Rahul Gandhi: తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి. ఈ నెల 6, 7న రెండు రోజుల పాటు రాహుల్ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. దాంతో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఫోకస్ అంతా రాహుల్ సెంట్రిక్ గా మారాయి. వరంగల్ లో రైతు సంఘర్షణ ఒక ఎపిసోడ్ అయితే హైదరాబాద్ లో ఓయూ విజిట్ మరో ఎపిసోడ్.

ఓయూ కు రాహుల్ రావాల్సిన అవసరం లేదని టీఎర్ఎస్ నేతలు చేస్తున్న రాద్దాంతంతో హస్తం, కారు పార్టీల మధ్య ఫైట్ మరో లెవల్ కు వెళ్ళింది. ఒక వైపు టీఆర్ఎస్ విమర్శల దాడి పెంచింది. ఇటు కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళన లతో అట్టుడికిస్తోంది. నేతల అరెస్ట్‌ల ను నిరసిస్తూ కేసిఆర్ దిష్టిబొమ్మల దగ్దం చేసింది.

ఇందిరా పార్క్ వద్ద యువజన కాంగ్రెస్ ధర్నా చేసింది. అసలు రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానంటే టీఆర్ఎస్‌లో ఎందుకు భయమని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. చారిత్రాత్మక యూనివర్సిటీని ఒక ఎంపిగా రాహుల్ గాంధీ సందర్శిస్తే తప్పేంటని హస్తం పార్టీ వాదన. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం తప్పా రాహుల్ ది పొలిటికల్ విజిట్ కాదంటున్నారు కాంగ్రెస్ నేతలు. వీసీ, కేసిఆర్ విజ్ఞత తో ఆలోచించాలని కోరుతున్నారు.

టీఆర్ఎస్ నేతల వైఖరి, వీసి తీరును నిరసిస్తూ వీసి ఛాంబర్ ముందు నిరసన తెలిపిన విద్యార్థుల మీద నాన్ బెయిల్ కేసులు పెట్టడాన్ని కాంగ్రెస్ తప్పు పడుతోంది. ఓయూ లో రాహుల్‌ పర్యటనకు అనుమతి నిరాకరించడం, అనంతర పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లోఉన్న NSUI విద్యార్థులతో రాహుల్ గాంధీ ములాఖాత్ కు టీపీసీసి ప్లాన్ చేసింది.

అందుకోసం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సహా కాంగ్రెస్ నేతలు వెళ్లి జైల్ సూపరిండింట్‌ను కలిశారు. ములాఖాత్ కోసం వినతి పత్రం ఇచ్చారు. అనుమతి ఇవ్వక పోయినా రాహుల్ గాంధీని ఓయూకు తీసుకు వెళ్లి తీరుతామంటున్నారు కాంగ్రెస్ నేతలు. మొత్తానికి రాహుల్ పర్యటనకు ముందే టీఆర్ఎస్ విమర్శలు, కాంగ్రెస్ నిరసనలతో వెదర్ వేడెక్కుతోంది. దీంతో రాహుల్ రెండు రోజుల టూర్ ఉత్కంఠ రేపుతోంది.

తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు రాహుల్ గాంధీ టూర్ చుట్టే తిరగుతున్నాయి. ఈ నెల 6, 7న రెండు రోజుల పాటు రాహుల్ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. దాంతో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ఫోకస్ అంతా రాహుల్ సెంట్రిక్ గా మారాయి. వరంగల్ లో రైతు సంఘర్షణ ఒక ఎపిసోడ్ అయితే హైదరాబాద్ లో ఓయూ విజిట్ మరో ఎపిసోడ్. ఓయూ కు రాహుల్ రావాల్సిన అవసరం లేదని టీఎర్ఎస్ నేతలు చేస్తున్న రాద్దాంతంతో హస్తం, కారు పార్టీల మధ్య ఫైట్ మరో లెవల్ కు వెళ్ళింది.

Tags

Read MoreRead Less
Next Story