TG : భట్టి విక్రమార్కకు రాహుల్ అధిక ప్రాధాన్యత

TG : భట్టి విక్రమార్కకు రాహుల్ అధిక ప్రాధాన్యత
X

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు భట్టి విక్రమార్క హాజరయ్యారు. సభా వేదికపై కుర్చీలు ఖాళీ లేకపోవడంతో భట్టి కాసేపు వెనక ఉండిపోయారు. తర్వాత సీటు ఖాళీ కావడంతో ముందుకు వచ్చి ఓ చోట కూర్చోబోయారు. దాన్ని గమనించిన రాహుల్ గాంధీ తన దగ్గరకు రావాలంటూ భట్టిని పిలిచారు. రేవంత్‌రెడ్డి పక్కనే ఉన్న చైర్‌లో మరొకరు కూర్చోవడంతో ఆయన్ను లేపి అక్కడ కూర్చోవాలంటూ భట్టికి సూచించారు. భట్టి కోసం రేవంత్ సీటు ఖాళీ చేయించడం, ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Tags

Next Story