Railway Station : కొమురెల్లికి రైల్లో పోవచ్చు.. రైల్వేస్టేషన్‌కు నేడే శంకుస్థాపన

Railway Station : కొమురెల్లికి రైల్లో పోవచ్చు.. రైల్వేస్టేషన్‌కు నేడే శంకుస్థాపన

బస్సులే దిక్కయిన తెలంగాణ (Telangana) పల్లెలకు కూడా రైలు కళ వస్తోంది. కొత్తపల్లి - మనోహరాబాద్‌ నూతన రైలు మార్గంలోని సిద్ధిపేట జిల్లా కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌ను నిర్మించబోతున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఫిబ్రవరి 15,2024న కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, ఇతేర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకుంటారు. నూతన హాల్ట్ స్టేషన్ ఈ ప్రాంతంలోని ప్రజల ఆకాంక్షలను నిలబెడుతుందని కేంద్రం తెలిపింది. ఈ స్టేషన్ మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో ఉంటుంది. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మనోహరాబాద్ - సిద్దిపేట రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు. లకుడారం, దుద్దెడ స్టేషన్‌ లను ఇది కలుపుతుంది.

మనోహరాబాద్ - కొత్తపల్లి కొత్త రైల్వే స్టేషన్ తో వేములవాడ, భీమేశ్వరాలయం, కొండగట్టు, కోటి లింగేశ్వర స్వామి, కొమురెల్లి మల్లన్న లాంటి ప్రముఖ దేవాలయాలను కలుపుతుంది. ప్రతిపాదిత స్టేషన్ నుంచి కొమురెల్లి మల్లన్న గుడి 3 కి.మీ. దూరంలో ఉంది. ఆలయానికి ఈజీగా భక్తులను చేర్చడంలో ఈ మార్గం ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. యాత్రికులతో పాటు విద్యార్థులు, చిన్న వ్యాపారులు, రోజువారీ ప్రయాణికులు, రోజువారీ కార్మికులకు కూడా ఈ స్టేషన్ ఉపయోగపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story