TG : తెలంగాణకు రెయిన్ అలర్ట్

X
By - Manikanta |4 Nov 2024 7:00 PM IST
తెలుగు రాష్ట్రాలను వానలు వీడడం లేదు. ఈ క్రమంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు మరోసారి తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com