Telangana : మరో నాలుగు రోజులు వర్షాలు

Telangana : మరో నాలుగు రోజులు వర్షాలు
X

తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పగలంతా ఎండలు దంచి కొడుతుంటే.. సాయంత్రం మాత్రం ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. ఈనేపథ్యంలో ఈనెల 7 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, ఆది లాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ఎండలు ఉంటాయని తెలిపిం ది. ఈ నెల 7వరకు రాష్ట్రంలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తా యని, గంటలకు 40-50 కి మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయని తెలిపింది. హైదరాబాద్ నగరం లో మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో రానున్న మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అత్యధిక ఎండల నేపథ్యంలో నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలా బాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Tags

Next Story