Rain Alert : ఈ నెల మొదటి వారం అంతా వర్షసూచన
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చింది. గత నెల రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు రాగా.. అక్టోబర్ మెుదటి వారంలోనూ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో చిన్నపాటి ద్రోణి ఏర్పడిందని.. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, మేడ్చల్-మలాజ్‌గిరి, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటోంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్రంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయని.. సాయంత్రం తర్వాత వాయవ్య తెలంగాణలో పలు జిల్లాల్లో జల్లులు కురుస్తాయని చెప్పారు.
తెలంగాణలో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. పలు చోట్ల పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో మాగ్జిమం 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందన్నారు. కొంత వేడి, ఉక్కపోత ఉండే ఛాన్స్ ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com