ORR: వారం రోజులుగా వరద ముప్పులో ఓఆర్ఆర్ జంక్షన్

ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పనుల్లో అధికారుల డొల్లతనం బయటపడింది. శంషాబాద్ పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ గ్రామాల చెరువుల మధ్య ఔటర్‌రింగ్ రోడ్డు జంక్షన్‌ను నిర్మించారు. పైగా ఎత్తు, పల్లాల నిర్మాణ విషయంలో సరైన విధానాలను అనుసరించలేదు.
ఇప్పుడు రెండు గ్రామాల చెరువులు అలుగుపోస్తుండడంతో ఓఆర్‌ఆర్ జంక్షన్ వారం రోజులుగా వరద ముప్పులోనే ఉంది. దీంతో ఎగ్జిట్ నెంబర్ 15ను అధికారులు మూసివేశారు. ఇదిలా ఉండగా.. పెద్ద గోల్కొండ చెరువు మరో రెండు ఫీట్లు నిండితే గాని తూములను తెరవకుండా ఇరిగేషన్ అధికారులు ఆంక్షలు విధించారు.
అయితే ఆంక్షలు ఎత్తివేసి, FTL సరిహద్దులను ఫిక్స్ చేసే వరకు చెరువు తూములను తెరిచే ప్రసక్తి లేదని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఓ ఆర్‌ఆర్ పనుల్లో నిర్లక్ష్యం వల్ల రెండు గ్రామాల ప్రజలతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com