Rainfall : ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

Rainfall : ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే
X

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్‌నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.

తెలంగాణలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. ఇవాళ కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు. గాలివానలో పిల్లలను పాఠశాలలకు పంపడంపై ఆందోళన చెందుతున్నారు.

Tags

Next Story