Telangana : నాలుగు రోజుల పాటు వర్షాలు .. 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Telangana : నాలుగు రోజుల పాటు వర్షాలు .. 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
X

రాగల నాలుగు రోజుల పాటు రా ష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వానలకు అవకాశం ఉందన్న అధికారులు 18 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్లు వాతా వరణ శాఖ వెల్లడించింది. అదే విధంగా ఉత్తర, దక్షణి ద్రోణి ప్రభావంతో పాటు ఆగ్నేయ బంగా ళాఖాతం, దాని పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడినట్లు చెప్పింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నా రాయణపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారె డ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

అక్కడక్కడ వర్షాలు

ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Tags

Next Story