BJP MLA Raja Singh : రాజాసింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్ల తొలగింపు

BJP MLA Raja Singh : రాజాసింగ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్ల తొలగింపు
X

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్లను మెటా తొలగించింది. ఎమ్మెల్యే ప్రసంగాలు ద్వేషపూరితంగా ఉన్నాయని ‘ఇండియా హేట్ ల్యాబ్’ నివేదిక ఇచ్చింది. దీంతో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ ఫేస్‌బుక్ పేజీల్లో 10లక్షలకు పైగా మెంబర్స్, ఇన్‌స్టాలో లక్షా55వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీనిపై స్పందించిన రాజాసింగ్ హిందువులే టార్గెట్‌గా సెలక్టెడ్ సెన్సార్‌షిప్ నడుస్తుందని ఆరోపించారు

కాగా, 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఏప్రిల్, జూన్ నెలల మధ్య సీనియర్ బీజేపీ నాయకులు చేసిన 266 మైనారిటీ వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలు అధికారిక పార్టీ ఖాతాల ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్ ఎక్స్ లలో ప్రత్యక్ష ప్రసారం చేశారని నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రాజా సింగ్ ద్వేషపూరిత ప్రసంగాల్లో 74.5 శాతం ద్వేషపూరితమని ఇండియా హేట్ ల్యాబ్ నివేదిక పేర్కొంది.

Tags

Next Story