BJP Rajasingh : బీజేపీకి రాజాసింగ్ రాజీనామా

BJP Rajasingh : బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
X

కొంత కాలంగా బీజేపీలోని కొందరు నాయకుల తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి అందజే శారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చే స్తానని ప్రకటించారు. తాను అధ్యక్ష పదవిని నామినేషన్ వేసేందుకు పార్టీ ఆఫీసుకు వచ్చానని తనకు మద్దతుగా నిలిచిన వారిని కొందరు బెదిరించారని రాజాసింగ్ ఈ సందర్భంగా చెప్పారు. తనకు మద్దతుగా ముగ్గురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారని అన్నారు. వాళ్లకు ఫోన్లు చేసి పార్టీలో ఉంటావా... సస్పెండ్ చేయాలా..? అంటూ బెదిరించారని ఆరోపించారు. పది మంది సంతకం చేసిన తర్వాతే ఇవ్వాలె. కానీ ఆల్రెడీ వాళ్లే రాష్ట్ర అధ్యక్షుడిని ఫైనల్ చేసేసుకున్నా రు. తెలంగాణ లో బీజేపీకి అధికారం రావ ద్దనుకునే వారి సంఖ్య పెరిగిందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్య వాదాలు చెప్పారు.

Tags

Next Story