GST Scam : జీఎస్టీ స్కామ్ ను సీబీఐకి ఇవ్వండి : రాజాసింగ్

X
By - Manikanta |31 July 2024 10:31 AM IST
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తెలంగాణలో కొత్తగా వెలుగులోకి వచ్చిన జీఎస్టీ కుంభకోణాన్ని సీబీఐకి బదిలీ చేయాలని ఆయన పేర్కొన్నారు. కాగా, తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ విభాగంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కామ్‌లో ఏ5గా రాష్ట్ర మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పేరును పేర్కొన్నారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే సీఐడీ నుంచి సీబీఐకి కేసును అప్పగించాలని రాజాసింగ్ అమిత్ షాను కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com