Raja Singh : అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ఆగమాగమవుతున్నరు : రాజాసింగ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ఫైరయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్ నేతలు గందరగోళానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. పని పాట లేక కేంద్రంపై కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. బీఆర్‌ఎస్ ఓడిపోవడంతో కేటీఆర్ ఆందోళనలో ఉన్నారన్నారని.. అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటుందని ప్రజలకు ఒక సూచన చేశారు. దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పనేమీ లేకపోవడంతో కేంద్రంపై కేటీఆర్ ఏదో ఒక ఆరోపణ చేయాలని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు మంచి ఫైట్ చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా కేటీఆర్ కూడా పోరాడాలి. కానీ, ఎక్కడో ఉండి ఇలా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా మధ్యలో వచ్చి మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే జనాలు మిమ్మల్ని పిచ్చి వాళ్లు అనుకుంటారు’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com