Rajiv Yuva Vikasam : జూన్ 2న రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్లు పంపిణీ

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్ర మాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం లో రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. నిరుద్యోగ యువత ఆశలను ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ప్రతిష్టాత్మకంగా భావించి రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చిందని అధికారులకు సూచించారు.
జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్దిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్య క్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయి లలో ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 15 తర్వాత గ్రౌండింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ప్రతినెలా ఈ కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయా లని, జిల్లా ఇంచార్జ్ మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధి కారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com