TG : బీజేపీ అధ్యక్షుడు గా రామ్ చందర్ రావు కరెక్ట్ కాదు...డిప్యూటీ సీఎం

ఇటీవలే తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన సారధి నీ నియమించింది ఆ పార్టీ అధిష్టానం. ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ నేత రామ్ చందర్ రావు కు పార్టీ పగ్గాలను అప్పగించింది.. గత కొన్ని రోజుల క్రితం పార్టీ కార్యాలయం లో బాధ్యతలు కూడా స్వీకరించారు రామ్ చందర్ రావు..ఐతే ఈ నియామకం పై హాట్ కామెంట్స్ చేసారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్ చందర్ రావు నియామకం కరెక్ట్ కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి.. యూనివర్సిటీల స్థితిగతులపై ఢిల్లీ ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన భట్టి మాట్లాడుతూ ... బీజేపీ ప్రభుత్వం యూనివర్శిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.
హైదరాబాద్ HCU లో రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ యూనివర్సిటీ కి వచ్చి విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దుతును ప్రకటించారనే విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు హెచ్సీయూకి వెళ్లి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒత్తిడి తెచ్చారని ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరికి దేశంలో బతికే హక్కు ఉందని, అందరికీ సమాన హక్కులు ఉన్నాయనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తెరగాలని హితువు పలికారు.
రాజకీయాల్లో ఒకరి పై ఒకరు కామెంట్లు చేసుకోవడం మాములు విషయమే. ఐతే పార్టీ వ్యవహారాలు , ఇతర పార్టీ నిర్ణయాల గురించి మాత్రం పెద్దగా ఊసెత్తరు నేతలు.. ప్రస్తుతం అందుకు బిన్నంగా కామెంట్ చేశారు డిప్యూటీ సీఎం భట్టి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com