Telangana : రాంచందర్ రావు నిజస్వరూపం బయటపడింది.. పొన్నం ఫైర్

Telangana : రాంచందర్ రావు నిజస్వరూపం బయటపడింది.. పొన్నం ఫైర్
X

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాంచందర్ తన అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టాడని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్‌లో చేర్చడం అసాధ్యమని అనడం సిగ్గుచేటన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని.. గతంలో తమిళనాడులో అది జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే రిజర్వేషన్లు అమలవుతాయని అన్నారు.

రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీం గతంలోనే చెప్పినట్లు పొన్నం తెలిపారు. అందుకే రాష్ట్ర కేబినెట్ ఆమోదం, శాసనసభ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో రిజర్వేషన్ల అంశం ఉందన్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని.. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించాలని సూచించారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమన్న పొన్నం.. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని అన్నారు. సీఎం రెడ్డి అయితే.. డిప్యూటీ సీఎం ఎస్సీ అని.. పీసీసీ చీఫ్ బీసీని ఎన్నుకోవడమే కాంగ్రెస్ సామాజిక న్యాయానికి నిదర్శనమన్నారు.

Tags

Next Story