TG : తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బ్యాక్ గ్రౌండ్ ఇదే!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని నియమితులయ్యారు. తెలంగాణ విజిలెన్స్ కమిషనర్ గా మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నియమితులయ్యారు. 1988 బ్యాచ్ కు చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్య తలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు.
2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేయగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి అదే హోదాలో ఆమెను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో రాణి కుముదిని కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటివరకు ఎస్ఈసీ పదవిలో కొనసాగిన పార్థసారధి పదవీకాలం ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసింది. రాణి కుముదినిని ఎస్ఈసీగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు జారీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్ఈసీ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాలు ప్రభుత్వం నియమించింది. 1983 బ్యాచ్కు చెందిన ఎంజీ గోపాల్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా మూడేళ్ల పాటు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

