CRIME: దారుణం.. ఇద్దరు బాలికలపై అత్యాచారం

CRIME: దారుణం.. ఇద్దరు బాలికలపై అత్యాచారం
X
అయిదుగురు దుండగుల ఘాతుకం... సెప్టెంబర్ 24న ఘటన

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం చేశారు. జనగామ, మల్కాజిగిరి ప్రాంతాలకు చెందిన ఇద్దరు బాలికలు(14,15) పునరావాస కేంద్రం నుంచి సెప్టెంబరు 24న పారిపోయారు. ఈ క్రమంలో ఆశ్రయం కల్పిస్తామని నమ్మించి వారిపై నాగరాజు, నాగరాజు, సాయి, రాజు, అఖిల్, రోహిత్ అత్యాచారం చేశారని బాధితురాళ్లు తెలిపారు.

ఏం జరిగిందంటే..

హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్ బాలికల పునరావాస కేంద్రం నుండి ఇద్దరు బాలికలు తప్పించుకొని పారిపోయారు. జనగామలో పరిచయం ఉన్నవారి ఇంటికి వెళుతుండగా.. వీరిని గమనించిన ఐదుగురు నిందితులు మాయమాటలు చెప్పి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిని కారులో తీసుకువచ్చి హైదరాబాద్ లో వదిలి వేశారు. పునరావాస కేంద్రం నిర్వాహకుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రేమ పేరుతో వేధింపులు.. ఐదేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్ లో విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించిన ఘటనలో పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రేమ పేరుతో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న వెంకటరమణ (29) విద్యార్థినిని వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చార్జీషీటు దాఖలు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యే క న్యాయమూర్తి నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.

Tags

Next Story