TG : జన్ పోషణ్​ సెంటర్ గా రేషన్ షాప్ లు : కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి

TG : జన్ పోషణ్​ సెంటర్ గా రేషన్ షాప్ లు : కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి
X

రేషన్‌ దుకాణాలను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చేందుకు పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్‌ షాప్‌ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చొరవలో భాగంగా ముందుగా ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, తెలంగాణ ప్రాంతాల్లోని 60 రేషన్‌ షాపులను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చనున్నారు.పైలట్‌ ప్రాజెక్ట్‌ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జోషి మాట్లాడుతూ.. ప్రస్తుతం రేషన్‌ షాప్‌ల పరిస్ధితుల గురించి వివరించారు. ‘దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపులు కేవలం 8- 9 రోజులు మాత్రమే తెరుస్తున్నారు. మరికొన్ని అయితే మూడు నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తాయి. మిగిలిన సమయాల్లో ఆ దుకాణాలను మూసేస్తున్నారు. డీలర్లకు ప్రస్తుతం ఉన్న కమీషన్లు సరిపోవట్లేదు. అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది’అని ఆయన అన్నారు. మేరా రేషన్‌ యాప్‌ అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను ఈ సందర్భంగా పరిచయం చేశారు.

Tags

Next Story