మసక చీకట్లో.. రింగరింగ అంటూ అడ్డంగా దొరికిపోయిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు

మత్తులో.. మసక చీకట్లో.. రింగరింగ అంటూ అడ్డంగా దొరికిపోయారు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్ధులు. నగర శివారులో రేవ్‌పార్టీని భగ్నం చేసిన పోలీసులు భారీగా మద్యం సీసాలు, డీజే వాహనం, 60 బైక్‌లు,14 కార్లను స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులను వెతికే పనిలో ఉన్నారు.
హైదరాబాద్‌లో కాస్త సద్దుమణిగినట్టు కనిపించిన రేవ్ పార్టీల విష సంస్కృతి మళ్లీ మొదటికొస్తోంది. నగర శివార్లలో రేవ్ పార్టీల గోల మళ్లీ మొదలైంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో హైఫైగా సాగుతున్న రేవ్‌పార్టీకి పోలీసులు చెక్ పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో భారీ ఎత్తున జరుగుతున్న పార్టీపై సమాచారం అందడంతో దాడి చేసి.. 90 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా మద్యం సీసాలు, డీజే వాహనం, 60 బైక్‌లు,14 కార్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో వందమంది వరకు పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దాడి చేసినప్పుడు వీరిలో పది మంది పరారయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా ఏడుగురు వ్యక్తులు ఈ రేవ్‌పార్టీని ఆర్గనైజింగ్ చేసినట్లు తెలుస్తోంది. గిరీష్ అనేవ్యక్తి తన ఇన్‌స్టా పేజీ ద్వారా అందరిని గైడ్ చేసినట్లు విచారణలో తేలింది. ఎంట్రీ ఫీజు ఒకరికి 500గా ఫిక్స్ చేసిన నిర్వాహకులు ఈవెంట్ కోసం ఢిల్లీ నుంచి ఫేమస్ డీజేను తీసుకువచ్చారు. జక్కిడి ధన్వార్ధర్‌రెడ్డికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఆయన కుమారుడు శ్రీకర్‌రెడ్డి ఈ రేవ్‌పార్టీని కోఆర్డినేట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ ముఠా లక్నవరంలో రేవ్‌పార్టీ నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, విద్యార్ధులతోపాటు కొందరు యవతులు ఉన్నారు. వీరి వద్దనుంచి గాంజా, మూడు గ్రాముల LSD, 120 లిక్కర్ సీసాలు, మూడు ల్యాప్‌టాప్‌లు, 15 కార్లు,30 బైక్‌లు,డీజే సిస్టమ్స్, 27వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కాలేజీ విద్యార్ధులపై కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు వారికి పేరెంట్స్ ముందు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ వారి దినచర్యపై ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com