TG : చిట్యాలలో పేలిన రియాక్టర్.. హైవేపై పొగలతో ట్రాఫిక్ జామ్

TG : చిట్యాలలో పేలిన రియాక్టర్.. హైవేపై పొగలతో ట్రాఫిక్ జామ్
X

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలో ఉన్న శ్రీపతి ల్యాబ్ లో అకస్మాత్తుగా రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయి. రసాయన పూరితమైన పొగ దట్టంగా వస్తుండడంతో జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు..ఫైర్‌ ఇంజన్‌లతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాద సమయంలో సుమారుగా 30 నుంచి 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story