Telangana : రేషన్ కార్డులకు రికమెండేషన్స్ అవసరం లేదు: మంత్రి

రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్డుల జారీకి ఎలాంటి రికమెండేషన్స్ అవసరం లేదని, అర్హులైన వారందరికీ ఇస్తామని చెప్పారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారిలో ఎవరైనా అనర్హులుంటే గ్రామ సభల్లో చెప్పాలని అన్నారు. వారి అప్లికేషన్లను పక్కనపెడతామని పేర్కొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్‌ను ఆవిష్కరించారు. నెల రోజుల్లో దీన్ని నిర్మించారు. ఇందులో హాల్, కిచెన్, బెడ్ రూం (అటాచ్డ్ బాత్‌రూం) ఉంటాయి. ఈ స్కీంలో భాగంగా ఒక్క ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు ఇస్తుంది. జనవరి 26 నుంచి ఈ ఇళ్లు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com