Minister Seethakka : ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లను తీసుకోవడం రికార్డు

ట్రాఫిక్అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను ప్రభుత్వం నియమించడం కొత్త చరిత్ర అని, దేశంలోని ఫస్ట్ం తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ సెక్రటేరియట్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న ట్రాన్స్ జెండర్లతో సీపీ సీవీ ఆనంద్ కలిసి మహిళా శిశు సంక్షేమతో శాఖ మంత్రి సీతక్క సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.., తెలంగాణ మోడల్ ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. ఆరు నెలలు క్రమశిక్షణతో డ్యూటీ చేసి ట్రాన్స్ జెండర్లు తమను తాము నిరూపించుకున్నారని చెప్పారు.'గత ఆరు నెలల కిందట ప్రయోగాత్మకంగా 44 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను ప్రభుత్వం నియమించింది. ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పిస్తే రాణిస్తామని ట్రాఫిక్ అసిస్టెంట్లు నిరూపించారు. ఎంతో క్లిష్టమైన ట్రాఫిక్ డ్యూటీని క్రమశిక్షణతో వహిస్తున్నారు.. ప్రతి ఒక్కరిలో సమర్థత ఉంటుందని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పని చేస్తు న్న ట్రాన్స్ జెండర్లు గొప్ప ఉదాహరణగా నిలుస్తున్నారు.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లను నియమించాం.. ఈ విషయాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. పోలీస్ శాఖలోనే కాకుండా ఇతర శాఖలో కూడా ట్రాన్స్ జెండర్లను నియమించే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.. ఎక్కడ ట్రాన్స్ జెండర్ల మీద వివక్షత లేకుండా అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తాం. ట్రాన్స్ జెండర్లందరికీ ట్రాఫిక్ అసిస్టెంట్లు ఆదర్శంగా నిలుస్తున్నారు.. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది గౌరవప్రద ఉద్యో గాలు చేసేందుకు ముందుకు రావాలి. పోలీస్ డ్రెస్ లో ట్రాన్స్ జెండర్లను చూసి సామాన్యులు సెల్యూట్ చేస్తున్నారు.. ఒకప్పుడు అవమా నాలు ఎదుర్కొన్న ట్రాన్స్ జెండర్లు ఇప్పుడు అపూర్వ గౌరవాన్ని అందుకుంటున్నారు. ’ అని సీతక్క అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com