Mahabubabad : మహబూబాబాద్‌లో ఏడు దశాబ్దాల్లోనే అత్యధిక వర్షపాతం

Mahabubabad : మహబూబాబాద్‌లో ఏడు దశాబ్దాల్లోనే అత్యధిక వర్షపాతం

గడిచిన 70సంవత్సరాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా శనివారం అర్ధరాత్రి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండ లంలో 46.9సెం.మీ వర్షపాతం నమోదైంది. నర్సింహులపేట, చిన్నగూడూరు, ఇనుగుర్తి మండలాల్లో 45 సెం.మీ వర్షపాతం నమోదు కావడంతో వరద సునామీ వచ్చింది.

భారీ వర్షాలతో ఆకేరు, మున్నేరు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు ఏకంగా 45 చెరువులు, కుంటలకు గండ్లుపడడంతో వరదనీరు వేలాది ఎకరాలను ముంచెత్తింది. కేసముద్రం - ఇంటికన్నె మధ్య రైల్వేట్రాక్ కూడా వరద ఉదృతికి కొట్టుకుపోయింది. మూడు రోజులుగా రైళ్ళ రాకపోకలతో పాటు, రోడ్డు రవాణా నిలిచిపోవడంతో ప్రయా ణికులు ఇబ్బందులు పడ్డారు.

Tags

Next Story