Red Alert : ఈ సాయంత్రం హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

హైదరాబాద్ కు ఈ సాయంత్రం హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. సిటీలోని అనేక ప్రాంతాల్లో జల్లులు పడతాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడొచ్చని సూచించింది. కాబట్టి.. సాయంత్రం వేళ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
గడిచిన 2 రోజులుగా హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, ట్యాంక్ బండ్, లకిడికపూల్ తో పాటు అమీర్ పేట, పంజాగుట్ట, SR నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, KPHB, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, కుత్బుల్లాపూర్ డుందిగల్, బౌరంపేట్ ,గండి మైసమ్మ, అల్వాల్, మచ్చబోల్లారం ఏరియాల్లో వర్షం పడింది. నగరంలోని ప్రధాన ఏరియాల్లో వర్షాలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి, బయో డైవర్షిటీ, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, ఐకియా నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ సిబ్బంది హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com