TG : స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు.. త్వరలో యాక్షన్ ప్లాన్ : మంత్రి సీతక్క

కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. పంచాయతీరా జ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారతల బలోపేతం కోసం సెంటర్ ఫరీసెర్చ్ ఇన్స్కమ్స్ అండాలసీస్ (క్రిస్ప్)తో ఎంవోయూ కుదు ర్చుకుంది. ఈమేరకు సెక్రటేరియట్లో మంత్రి సీతక్కతో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్. సుబ్రమణ్యం భేటీ అయ్యారు. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు క్రిస్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, సీఆర్డీ డైరెక్టర్ సృజనలు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. దేశంలోని 14 రాష్ట్ర ప్రభుత్వాలతో క్రిస్ప్ కలిసి పనిచేస్తోంది. ఆయా రాష్ట్రాలకు క్రిస్ప్ ఉచితంగా సేవలందిస్తోంది. గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీ లను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణ లు తెచ్చే దిశలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క కోరారు. స్థానిక ఎన్నికలు పూర్తయి కొత్త పాలకమండలి ఏర్పడే నాటికి యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com