TG High Court : సీఎం రేవంత్ రెడ్డికి ఊరట... ఆ కేసును కొట్టివేసిన హైకోర్టు..

TG High Court : సీఎం రేవంత్ రెడ్డికి ఊరట... ఆ కేసును కొట్టివేసిన హైకోర్టు..
X

తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. బీజేపీ నేత ఫిర్యాదు తో రేవంత్ రెడ్డి పై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. గతేడాది మే 4న కొత్తగూడెం లో జరిగిన సభలో పాల్గొన రేవంత్ రెడ్డి... బీజేపీ పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. దీంతో తమ పార్టీ పరువుకు భంగం కలిగించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని... బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసు విచారణ ప్రజాప్రతినిధుల కోర్టు లో జరుగుతుండగా... కేసు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. ఇటీవలే గోపనపల్లి ప్రైవేట్ భూ వివాదం కేసులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్.పెద్దిరాజు దాఖలు చేసిన ట్రాన్స్ ఫర్ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ డిస్మిస్ చేసింది.

Tags

Next Story