Telangana High Court : కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావుకు హైకోర్టు లో ఊరట లభించింది. మేడిగడ్డ కుంగుబాటు కేసులో విచారణకు రావాలంటూ భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మేడిగ డ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్ రావు హైకోర్టులో నిన్న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని కేసీఆర్, హరీశ్రావు, అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు హరిరామ్, శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టీ సంస్థ లకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు కేసీఆర్ సహా ఇతరులు కారణమని పేర్కొంటూ నా గవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి మొదట మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. తమకు పరిధి లేదని పేర్కొంటూ మే జిస్ట్రేట్ కోర్టు సదరు పిటిషన్ను కొట్టేసింది. రాజలింగం రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా నోటీసులు జారీ చేసింది. రివిజన్ పిటిషన్ ను స్వీకరించే అధికార పరిధి భూపాలపల్లి జిల్లా కోర్టుకు లేదని, దాన్ని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్రవులు హైకోర్టును ఆశ్రయిం చారు. ఇవాళ విచారించిన కోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com