TG : హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలని నేషనల్ డిస్పాచ్ సెంటర్(ఎన్ఎల్ డీసీ)ని న్యాయస్థానం ఆదేశించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా ఎన్ఎల్ డీసీ అడ్డుకుంది.దీంతో గురువారం ఉదయం నుంచి విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని ఎన్‌ఎల్‌డీసీని ఆదేశించింది. దీంతో విద్యుత్ కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ప్రభుత్వానికి అడ్డంకి తొలగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com