KTR : అరెస్టు నుంచి రిలీఫ్.. విచారణకు కేటీఆర్ ను పిలిచే అవకాశం!

ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్27కు వాయిదా వేసింది. ఈ-కార్ రేసు అంశంలో తనపై నమోదైన ఎఫ్ ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ఏసీబీ ఇవాళో, రేపో అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను 10 రోజులపాటు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. అదే సమయంలో విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. దీంతో ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం కురిపించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com