TG : ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు

TG : ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు
X

నగర శివారులోని రాజేంద్రనగర్ సర్కిల్ మదుబన్ కాలనీలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలను టౌన్ ప్లానింగ్ సిబ్బంది నేలమట్టం చేశారు. ప్రతిరోజూ పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని, నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లపై ఏర్పాటుచేసిన 200 వరకు ఉన్న దుకాణాలను తొలగించారు. దీంతో స్థానికులు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వేరే ప్రాంతాల్లో అనుమతులు లేకున్నా పట్టించుకోరు కానీ.. తమ ఇంటిముందు ఏర్పాటుచేసుకొన్న షెడ్లను మాత్రం తొలగిస్తున్నారంటూ స్థానికులంతా అధికారులతో గొడవకు దిగారు.

Tags

Next Story