Renu Desai : తెలంగాణ మంత్రిని కలిసిన రేణుదేశాయ్

Renu Desai : తెలంగాణ మంత్రిని కలిసిన రేణుదేశాయ్
X

తెలంగాణ మంత్రి కొండా సురేఖను ( Konda Surekha ) కలిశారు సినీ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ ( Renu Desai ). జూబ్లీహిల్స్‌లోని మంత్రి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రి సురేఖతో పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు రేణు దేశాయ్. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను మంత్రి సురేఖకి వివరించారు రేణు దేశాయ్. ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణు దేశాయ్‌కి తన స్వహస్తాలతో అలంకరించారు మంత్రి సురేఖ .కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణు దేశాయ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Tags

Next Story